సదాశివపేటలో గురువారం ద్విచక్ర వాహనం, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు వెంటనే వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది