జనగామ జిల్లా కేంద్రంలోని ఏసిపి కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు,మిలాద్ ఉన్ నాభి సందర్భంగా హిందూ,ముస్లిం నాయకులతో డీసీపీ రాజమహేంద్ర నాయక్ పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హిందూ ముస్లింలు ఎప్పటిలాగే ఐక్యమత్యంగా ఉంటూ ప్రశాంత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని కోరారు.ఎలాంటి సమస్య వచ్చినా 24 గంటలు పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు.