ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. మండల తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పబ్లిక్ గ్రీవెన్స్ లో అందిన దరఖాస్తులను పరిశీలించి న్యాయంచేస్తామని ఆమె తెలిపారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.