మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ మరియు తూర్పు బజార్ లోని జువిచెట్టు సెంటర్ వద్ద మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ప్రజల కోసం జీవించే ప్రజల కోసం పోరాడి ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల హృదయాలలో ఆయన స్థానం చిరస్మరణీయంగా ఉంటుందని అన్నారు.