ఐకెపి,వివోఏల 3 నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని CITU ఆధ్వర్యంలో కెరమెరి వివోఏలు నిరసన తెలిపారు.గురువారం కెరమెరి మండల కేంద్రంలో CITU మండల కన్వీనర్ ఆనంద్ రావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ పని చేస్తున్న వీవోఏలపై ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న కూడా వారికి వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పని ఒత్తిడి భారాన్ని పెంచుతున్నారే తప్ప,వేతనాలు పెంచడం లేదన్నారు.