ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పర్యావరణానికి జరిగే హానిని నివారించడానికి ప్రజలందరూ మట్టి గణపతులను పూజించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు. నిర్మల్ కలెక్టరేట్లో గోడ పత్రాలను ఆవిష్కరించిన ఆమె, మట్టి విగ్రహాల పూజ ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు.