సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆదర్శనగర్ లో దోపిడి దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. పట్టణ బైపాస్ రోడ్డు సమీపంలోని శోభారాణి కి చెందిన ఇంట్లో తాళాలు, బీరువా పగలగొట్టి 2.30 లక్షల విలువైన బంగారు, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం గుర్తించిన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై వినయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.