Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: ఆర్టీసీ డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సులలో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్: పేట డి ఎం లావణ్య

Narayanpet, Narayanpet | Sep 25, 2025
నారాయణపేట పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఆర్టీసీ డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు ఈనెల 27 వ తేదీ నుండి అక్టోబర్ 6 వ తేదీ వరకు ప్రయాణించిన ప్రయాణికులు తమ టికెట్ వెనుక భాగంలో తమ పేరు ఫోన్ నెంబరు చిరునామా రాసి బస్టాండ్ లోని లక్కీ డ్రా బాక్స్ లో వేయాలని గురువారం పేట డిఎం లావణ్య ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 8వ తేదీన లక్కీ డ్రా రీజియన్ స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. డ్రా లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 25, రెండవ బహుమతి 15, 3 వ బహుమతి లో గెలుపొందిన వారికి 10 వేల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us