సీజనల్ మార్పుల కారణంగా జ్వరాలు ఎక్కువగా వస్తున్నందున ప్రజలు జాగ్రత్త గా ఉండాలని మంగళవారం మధ్యాహ్నం గంట్యాడ లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ హేమలత సూచించారు. ప్రస్తుతం వస్తున్న జ్వరాలు వైరల్ జ్వరాలు అని వీటిపై పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. జ్వరాలు వచ్చిన వ్యక్తులు హాస్పిటల్ కి వచ్చి పరీక్షలు చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకోవాలని సూచించారు. నీటిని ఎక్కడపడితే అక్కడ తాగకుండా కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు.