జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మార్చి 4వ జగ్గంపేట జగనన్న కాలనీ వద్ద వనపర్తి బాపిరాజు తో మరో ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 492.8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రిమైండర్ కి తరలించిన విషయం తెలిసిందేనని, అందులో భాగంగానే గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన వనపర్తి బాపిరాజు అనే వ్యక్తి గంజాయి ద్వారా అక్రమంగా రవాణా చేసి సంపాదించిన ప్రభుత్వ విలువ ప్రకారం10,92,000/-రూపాయల ఆస్తిని అదేవిధంగా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 41 లక్షల ఆస్తిని ఫ్రీజ్ చేయడం జరిగిందని ci తెలియజేశారు