యాడికిలోని పురాతనమైన పెద్దమ్మ ఆలయంలో మంగళవారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పెద్దమ్మ దేవతను బాలా త్రిపురా సుందరీ దేవిగా అలంకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అర్చనలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచారు. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.