కూటమి ప్రభుత్వ హయాంలో సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం స్పష్టం చేశారు. తిరువూరు మండలం లక్ష్మీపురంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నూతన పిఎసిఎస్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని దానిని ఆదిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.