విద్యార్థుల సంక్షేమం, భద్రత,ర్యాగింగ్ కార్యకలాపాలు, గంజాయి మరియు మాదకద్రవ్యాలు వాడకంపై కట్టుదిట్టు చర్యలు తీసుకోవడంపై దృష్టిసారిస్తూ, విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, సవాళ్లపై అవగాహన కల్పించడం, వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని పలు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్, అడ్మినిస్ట్రిక్షన్ విభాగాలు, హాస్టల్ వార్డన్స్ మరియు విద్యార్థులతో జిల్లా ఎస్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆత్మహత్యలు, ర్యాగింగ్, వేధింపులు, సైబర్ నేరాలు,పై అవగాహన కల్పించారు