కుప్పం మున్సిపాలిటీ డీకే పల్లి రైల్వే అండర్ బ్రిడ్జి క్రింద బుధవారం ఓ ప్రైవేట్ బస్సు నిలిచిపోయింది. కుప్పంలో కురిసిన భారీ వర్షానికి డీకేపల్లి అండర్ బ్రిడ్జి కాస్త నీటి గుంటలా మారింది. అయితే ఓ ప్రైవేటు బస్సు కుప్పం నుంచి తమిళనాడు వైపు వెళ్తూ అండర్ బ్రిడ్జి కింద నీళ్లలో చిక్కుకుంది. అండర్ బ్రిడ్జ్ కింద నీళ్లు అధికంగా ఉండడంతో బస్సు కాస్త బ్రిడ్జి కింద నిలిచిపోయింది.