సెట్టూరు మండలం ములకలేడు గ్రామం లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాండవిస్తున్నది. చెత్తాచెదారం పేరుకుపోయింది. వాటర్ ట్యాంకులు కూడా పంచాయతీ అధికారులు శుభ్రం చేయడం లేదు. అపరిశుభ్రత, కలుషిత నీరు కారణంగా గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రతను తొలగించి, వాటర్ ట్యాంకులు శుభ్రం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.