శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి నుండి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ కు ఐచర్ వాన్ లో తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం జాతీయరహదారిపై కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు.కోటబొమ్మాలి,టెక్కలి లో సేకరించిన పిడిఎస్ బియ్యాన్ని ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారాన్ని అందుకున్న కాశీబుగ్గ పోలీసులు,పలాస టోల్ ప్లాజా వద్ద మాటువేసి పట్టుకున్నారు.అనంతరం బట్టుకున్న బియ్యం పిడిఎస్ బియ్యమా? కాదా? అని తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారులకు పోలీసులు తెలియజేయగా,పరీక్షించిన పలాస రెవెన్యూ అధికారి తిరుపతిరావు, పట్టుబడ్డ బియ్యం పిడిఎస్ బియ్యమేనని తేల్చారు.