బీసీలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని బందరు MLA మరియు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం మద్యాహ్నం 4 గంటల సమయంలో రాష్ట్ర సచివాలయంలోని మూడో బ్లాకు సమావేశ మందిరంలో వడ్డెర సొసైటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం అయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వడ్డెరలకు మైనింగ్ లీజుల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటుగా, సీనరేజిలో 50 శాతం సబ్సిడీ కల్పింస్తున్నామని తెలిపారు.