పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ జగిత్యాల జిల్లాలోని (5) మున్సిపాలిటీలలో 59 వేల 388 సంఘ సభ్యులు గల 5 వేల 633 మహిళా సంఘాలకు 2025-2026 ఆర్థిక సంవత్సరంలో మహిళలు ఆర్థికముగా నిలదొక్కుకొనుటకు 226 మహిళా సంఘాలలోని 2 వేల 280 మహిళా సంఘ సభ్యులకు 31.70 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజి ద్వారా ఋణాలు ఇప్పించడం జరిగిందని జగిత్యాల జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.స్త్రీనిధి ద్వారా ఇప్పటి వరకు 341 మహిళా సంఘాలలోని 685 మహిళా సంఘ సభ్యులకు 6.85 కోట్ల రూపాయలు ఋణాలు ఇప్పించడం జరిగింది.జగిత్యాల జిల్లాలోని (5) మున్సిపాలిటీలలో 16 వేల 792 వీధి వ్యాపారుల