మంగళవారం ఉదయం సమయాన్ని ఆయుధంగా మార్చుకుని తన కవిత్వం, రచనల ద్వారా ప్రజలకు చైతన్యం కల్పించిన మహనీయుడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని కలెక్టర్ బి.ఎం. సంతోష్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాళోజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి వెలిగించి నివాళులర్పించారు. తెలంగాణకు స్వాతంత్ర్య సమరయోధుడుగా, ప్రజాకవిగా, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతగా ఆయన సేవలను కొనియాడారు.