MLC కల్వకుంట్ల కవితను BRS పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ మాజీ CM KCR తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల నిర్ణయం,పార్టీ శ్రేయస్సు దృష్యా కవితను సస్పెండ్ చేయడం జరిగిందని,పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవన్నారు,పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినందుకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు.కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కాంగ్రెస్ కుట్ర చేసిందని అన్నారు.