అనంతపురం నగరంలోని రాజు రోడ్డులో 14వ డివిజన్ పరిధిలోని డ్రైనేజీ కాలువలు చాలా అధ్వానంగా తయారయ్యాయి. దుర్వాసనతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్ శానిటేషన్ వర్కర్లు కనీసం నెలరోజులకు ఒకసారి కూడా మురికి కాలువలను శుభ్రం చేయడం లేదు. దీంతో డివిజన్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్ కమిషనర్, అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలను రెగ్యులర్గా శుభ్రం చేయించాలని కాలనీవాసులు కోరుతున్నారు.