మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బిఐ బ్యాంకును గురువారం మధ్యాహ్నం సీపీ అంబర్ కిషోర్ ఘా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్యాంకును పరిశీలించడం జరిగిందని, బ్యాంకులో పనిచేసే సిబ్బందిలో ఒకరు మిస్సింగ్ ఉన్నారని తెలిపారు. బ్యాంకులో కొంత బంగారం, నగదు మిస్సింగ్ లో ఉన్నట్లు గుర్తించామని, సీసీ కెమేరాలు, రికార్డులు పరిశీలిస్తున్నామని, ఆడిట్ సిబ్బంది ఇచ్చిన పూర్తి నివేదిక తర్వాత మొత్తం ఎంత మేర అవకతవకలు జరిగాయో వెల్లడిస్తామని తెలిపారు. బ్యాంకులో పని చేస్తున్న క్యాషియర్ నరిగె రవీందర్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.