రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన ఓ వివాహితను వేదించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. పెండ్యాల హరీశ్ ను గురువారం అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు. జల్సాలకు అలవాటు పడిన హరీశ్ సదరు మహిళను లోబరుచుకుని కొంతకాలంగా శారీరకంగా, ఆర్థికంగా వాడుకున్నట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రెబ్బెన పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అతనికి సహకరించిన కమలాకర్ ను కూడా అరెస్టు చేశామన్నారు.