గుత్తి మున్సిపాలిటీ తో పాటు మండల వ్యాప్తంగా శుక్రవారం వినాయకుల నిమజ్జన కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో గుంతకల్ డీఎస్పీ శ్రీనివాస్ పోలీస్ అధికారులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి నిమజ్జనం చేసే ప్రాంతాలను గురువారం పరిశీలించారు. గుత్తి చెరువు,తురక పల్లి రోడ్డులోని కుంట, లచ్చానపల్లి రోడ్డు లోని కుంట, ఎస్ఎస్ పల్లి చెరువు లను పరిశీలించారు. ప్రశాంతంగా నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. నిమజ్జనానికి బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానిక పోలీస్ అధికారులను ఆదేశించారు.