గణేష్ నిమజ్జనం రోజున హిందూ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదికపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చేసిన వాఖ్యాలపై కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్ లో చేసిన పిర్యాదును బిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దివాకర్ రావు ఎలాంటి ఉద్దేశపూర్వక వాక్యలు చేయలేదని, ఇటీవల జరుగుతున్న దురదృష్టకర సంఘటన గురించి మాత్రమే ప్రస్తావించారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు రాజకీయం మనగడ కోసం ఇలాంటి ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు.