నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోమలలో విష్ణు కంటి క్షేత్రము శ్రీ రామ్మోహన్ స్వామి ఆశ్రమంలో శ్రీరామ నామజపం కొనసాగుతోంది. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆదివారం బేతంచెర్ల భజన కృష్ణయ్య శిష్య బృందం, శ్రీ కోదండ రామస్వామి సేవ భక్త బృందముచే రామనామ పారాయణం చేశారు. రామనామ పారాయణం విశిష్టతను వివరించారు.