ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారిని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానికి విచ్చేసిన వారికి ఆలయ సహ కమిషనర్ మరియు కార్య నిర్వహణాధికారిని అల్లు వెంకట దుర్గ భవాని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం అర్చకులు కలెక్టర్ కు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేసారు. కార్యక్రమంలో ఆర్డీవో అఖిల, రెవిన్యూ సిబ్బంది ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.