యూరియా కొరత, ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కర్నూలు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరుకు పిలుపునిచ్చింది. మంగళవారం ఉదయం 12 గంటలు కర్నూలు చిల్డ్రన్ పార్క్ నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా నాయకులు మండిపడుతున్నారు. యూరియా ను బ్లాక్ మార్కెట్ లో తరలించి, వ్యాపారం చేసుకుంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో ఉల్లికి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు.