Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 22, 2025
భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు ఎమ్మెల్యే గండ్ర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలు మురిసేలా పనుల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని,ఈ నేపథ్యంలో చిట్యాల మండలంలో 40 లక్షల రూపాయలతో వేస్ట్ మేనేజ్మెంట్ భవన నిర్మాణానికి, 20 లక్షల రూపాయల నిధులతో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. పనుల జాతర కొనసాగుతుందన్నారు ఎమ్మెల్యే గండ్ర.