ముమ్మిడివరం మండలం, గేదెల్లంక లో శుక్రవారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గ్రామంలో సుమారు పది మందిని పైగా గాయ పరిచిందని స్థానికులు తెలిపారు. భయాందోళనకు గురైన ప్రజలు తమ రక్షణకు కర్రలను చేతబూని తిరుగుతున్నారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంబంధిత అధికారులు స్పందించి విచ్చలవిడిగా తిరుగుతున్న పిచ్చికుక్కను కట్టడి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.