ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా ఈరోజు 5 వార్డు రాజీవ్ గృహకల్ప సచివాలయం 76,77 పరిధిలో కార్పొరేటర్ మొల్లి హేమలత స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ..ముఖ్యమoత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ పరంగా మరింత ముందుకు వెళుతుందని అందులో భాగంగా ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1.45 కోట్ల రేషన్ కార్డులను QR కోడ్ స్మార్ట్ రేషన్ కార్డులుగా అప్‌గ్రేడ్ చేసిందనీ,QR కోడ్ ను స్కాన్ చేసి కుటుంబ వివరాలు, వస్తువుల హక్కులు, రేషన్ చరిత్ర చూడవచ్చునని అన్నారు.