కోసిగి: మండలంలో గుంతల రోడ్లను పూడ్చడానికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అధికారులు, ప్రజాప్రతినిధులు మరమ్మతులు చేయలేదని సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు అన్నారు. సోమవారం వైయస్సార్ కూడలి నుంచి ఉల్లిగడ్డల దుకాణం వరకు రోడ్ల మరమ్మతులకు విరాళాలు సేకరించారు. ఆదోని నుంచి కోసిగికి నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు. ఈ రోడ్డులో ఉన్న గుంతలను పూడ్చాలని సిపిఐ మరియు ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు కోరారు.