టీటీడీ ఈవో గారు రెండోసారి అవకాశం రావడం తనకు మరింత బాధ్యతను పెంచిందని అనిల్ కుమార్ సింఘాలన్నారు టీటీడీ ఈవో గా నూతనంగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడారు తనకు ఈ అవకాశం రెండోసారి కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు ధన్యవాదాలు తెలిపారు మొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 వరకు మూడు సంవత్సరాలు నాలుగు నెలలు సేవలందించే అవకాశం వచ్చింది అని చెప్పారు గత సంవత్సరం నుంచి లడ్డు అన్న ప్రసాదాల క్వాలిటీ మెరుగుపడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.