ఉండవెల్లి మండల పరిధిలోని బొంకూరు గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆటోకి నిప్పు పెట్టిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది బొంకూరు గ్రామానికి చెందిన మాల రాజశేఖర్ కూరగాయలను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.ఓర్వలేని వ్యక్తులు ఆటోకి నిప్పు పెట్టినట్లు బాధితుడు ఆవేదనను వ్యక్తం చేశారు. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిలినట్లు బాధితుడు తెలిపారు .