గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అన్ని జిల్లాల నుండి SCT కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరై, SCT సివిల్ ఎపిఎస్పీ ఉద్యోగాలకు ఎంపికైన పురుష, స్త్రీ అభ్యర్థులు ఈ నెల 23 న జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు హాజరుకావాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అభ్యర్థులు సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషనుతో జతపరిచిన అన్ని ధ్రువ పత్రాల ఒరిజినల్ సర్టిఫికెట్స్, గెజిటెడ్ అధికారులతో అటెస్టేషను చేయించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలను, నాలుగు పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటోలను తీసుకొని రావాలని ప్రకటనలో ఎస్పీ తెలిపారు.