తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయానికి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా 106 ఫిర్యాదులు అందాయని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజల నుంచి ఆయన నేరుగా అర్జీలను స్వీకరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో సత్వర న్యాయం చేయాలంటూ అధికారులను ఆదేశించారు.