రెబ్బెన మండలంలోని నవేగాం వాగు శివారులో శుక్రవారం గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. ఇటీవల జిల్లాలో ఏకతాటిగా కురిసిన వర్షాలకు వరద ప్రవాహానికి వృద్ధురాలి మృతదేహం కొట్టుకువచ్చి నవేగం వాగు శివారులో తుమ్మచెట్లకు చిక్కుకుంది. ఇది గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసినట్లు రెబ్బెన పోలీసులు తెలిపారు..