నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురంలోని పల్లె దావకాన లేకపోవడంతో ప్రజలు వైద్య సేవలకు నోచుకోక నానా అవస్థలు పడుతున్నారు.ఈ సందర్భంగా మంగళవారం తెలిసిన వివరణ ప్రకారం గత ప్రభుత్వంలో ఆసుపత్రికి స్థలం సేకరించిన పనులు మొదలు కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్తులు మండిపడుతున్నారు. అత్యవసర వైద్యం కోసం 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొనివందని ఆవేదన వ్యక్తం చేశారు .ఇకనైనా అధికారులు నిద్రవీడి ఆసుపత్రిని నిర్మించాలన్నారు.