వికారాబాద్ మండలంలో పలు రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయని ముఖ్యంగా మోత్కుపల్లి మైలారం దేవరంపల్లి, జైలు పల్లి గోధుమగుడా రోడ్లన్నీ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్నాయని, వెంటనే ప్రభుత్వం రోడ్లన్నీ బాగు చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ర్యాలీ తీసి తాహసిల్దార్ కు వినపత్రం సమర్పించారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనను వికారాబాద్లో అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శివరాజ్ గౌడ్, సదానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.