విద్యార్థులను టీచర్లు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ తెలిపారు. మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గురుపూజోత్సవ వేడుకలకు శనివారం ఆయన హాజరయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.