ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాలు ప్రకారం హౌసింగ్ బోర్డ్ కాలనీ చెందిన కృష్ణ ఆటో డ్రైవర్ గా జీవన సాగి స్తున్నారు. ఇతడికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారూ. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.