Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: విజయనగరం JNTU జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి

Vizianagaram, Vizianagaram | Sep 1, 2025
విజయనగరం JNTU జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మధుపాడ గ్రామానికి చెందిన ఎర్రయ్య అనే వ్యక్తి తన బైక్ పై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎర్రయ్య అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ పై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us