రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నానాయుడు పై జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. శనివారం విజయనగరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే.. రైతులను కించపరిచే విధంగా మాట్లాడటం మంత్రికి తగదన్నారు. మీకు ఓట్లు వేసిన పాపానికి రైతులు క్యూలైన్లో నిల్చోవాలా..? ఎందుకు నిల్చోవాలని ప్రశ్నించారు. గతంలో ఎన్నడు ఈ పరిస్థితి లేదన్నారు.