బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కురుస్తున్న అకాల వర్షాలకు వరి పంట నీట మునిగింది. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామంటూ పెనుబల్లి గ్రామ రైతులు కన్నీరు మున్నీరయ్యారు. నాలుగు రోజుల్లో పంట చేతికి వస్తుందనుకునే లోపే వర్షం తమను నిండా ముంచిందన్నారు. ఎకరాకు దాదాపు రూ.40 వేలు ఖర్చు అయిందన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.