ఆగస్టు నెలకు పి. గన్నవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా 736 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్లను అందిచామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం అంబాజీపేట మండలంలోని పుల్లెట్టికుర్రులో లబ్ధిదారులకు నూతనంగా మంజూరు అయిన పెన్షన్ల సొమ్మును ఇచ్చారు.