స్టోన్ హౌస్ పేటలోని 10 డివిజన్ నుంచి భీమవరపు రాఘవేంద్ర, భీమవరపు చిన్న రాఘవేంద్రలు బీజేపీ లో చేరారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు వంశిధర్ రెడ్డి కండువాలు కప్పి వారిని పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ కలిసి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు. మోడీ సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ స్వతంత్రంగా పార్టీని బలోపేతం చేసుకునేందుకు అందరూ కృషి చేయాలి అన్నారు.