అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో డీమార్ట్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నగరానికి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.