వినాయక ఉత్సవాలు ఆదిలాబాద్లో ఘనంగా జరుగుతున్నాయి. పది రోజులు పూజల అనంతరం పలు చోట్ల శుక్రవారం నిమజ్జన వేడుకలు వైభవంగా చేపట్టారు. మీడియా కెమెరామెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియా సభ్యులతో కలిసి వారు ఉత్సాహంగా డాన్స్ చేశారు.