శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో AISA ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం NEPపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమన, జిల్లా అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం (NEP)పై దేశవ్యాప్తంగా విమర్శలు ఉన్నాయన్నారు.విద్యా రంగానికి బడ్జెట్లో అధిక శాతం నిధులు కేటాయించాలన్నారు. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసే వరకు ఐసా పోరాటాల కొనసాగిస్తుందని తెలిపారు.