గురజాల నియోజకవర్గంలో టిడిపి నాయకులు చికెన్ స్కాం కు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో నరసరావుపేట పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఎరపతినేని కనుసైగల్లో ఈ దందా కొనసాగుతుందని తెలిపారు. టిడిపి నాయకులే చికెన్ షాపులు నడపాలని మిగతావారు మూసివేయాలని హుక్కును జారీ చేశారని విమర్శించారు. ఈ వ్యవహారం సిగ్గుచేటు అని ఆయన పేర్కొన్నారు.